మంచు వారితో అనసూయ..

287
Anasuya bags Mohan Babu's film
- Advertisement -

బుల్లి తెరపై చాలామంది యాంకర్లు గా కెరియర్‌ మొదలుపెట్టి కొద్ది కాలం చేయగానే సినిమాలో అవకాశాలు రావడంతో యాంకరింగ్‌కి స్వస్తి పలికేస్తారు. కానీ యాంకర్‌ అనసూయ మాత్రం అటు బుల్లి తెరపై అలరిస్తునే ఇటు వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. బుల్లితెరపై తనదైన స్టైల్‌లో యాంకర్‌గా దూసుకుపోతు అలాగే వెండి తెరపై కూడా నచ్చిన పాత్రలు వచ్చినప్పుడల్లా ఆమె మెరుస్తూనే వుంది. అలా క్షణం, సోగ్గాడే చిన్నినాయనా,విన్నర్ సినిమాల్లో సందడి చేసిన అనసూయ ప్రస్తుతం చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో సినిమాను చేస్తోంది.

Anasuya bags Mohan Babu's film

అయితే ఈ అమ్మడు తాజాగా మోహన్ బాబు సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టుగా సమాచారం. మోహన్ బాబు విష్ణు ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకి అనసూయ అయితేనే సరిగ్గా నప్పుతుందని ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. ఈ సినిమా గురించి త్వరలోనే పూర్తి వివరాలతో పాటు,అనసూయను ఎంపిక చేసిన విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.

- Advertisement -