రివ్యూ : ఆనందో బ్రహ్మ

290
- Advertisement -

టాలీవుడ్‌లో హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. ‘ప్రేమకథా చిత్రమ్‌’ తర్వాత హర్రర్‌ కామెడీ సినిమాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.  తాజాగా అదే జోనర్‌లో వస్తున్న చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. తాప్సీ పన్ను ప్రధానపాత్రలో గితాంజలి ఫేమ్ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ చిత్రాల బాటలో తెరకెక్కిన  ఆనందోబ్రహ్మ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం….

కథ:

సిద్ధు (శ్రీనివాస్ రెడ్డి)కి గుండె జ‌బ్బు. ఏటీఎమ్ ద‌గ్గ‌ర సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసే  ఫ్లూట్ రాజు (వెన్నెల‌కిషోర్‌) త‌నకున్న రేచీక‌టి స‌మ‌స్య వ‌ల్ల ఓ కేసులో ఇరుక్కుంటాడు.  తాగుడుకి బానిసయిన తుల‌సి (తాగుబోతు ర‌మేష్‌)కి ఇంట్లో స‌మ‌స్య‌లు. బాబు (ష‌క‌ల‌క శంక‌ర్‌) సినిమా పిచ్చితో త‌న షాప్ అమ్మేసి ఇబ్బందుల్లో పడ‌తాడు. ఇలా ఒకొక్క‌రిదీ ఒక్కో స‌మ‌స్య‌. అంద‌రికీ డ‌బ్బు అత్య‌వ‌స‌రం. ఈ క్రమంలో సిద్ధుకి   రాము (రాజీవ్ క‌న‌కాల‌) ప‌రిచ‌య‌మ‌వుతాడు.  ఆ తర్వాత ఏం జరుగుతుంది…? ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు…?దెయ్యాల్ని చూసి మ‌నుషులు భ‌య‌ప‌డ్డారా?  లేక మ‌నుషుల్ని చూసి దెయ్యాలే భ‌య‌ప‌డ్డాయా?  అనేది తెర‌పై చూడాల్సిందే.

Anando Brahma movie Review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కాన్సెప్ట్‌, క‌థ‌నం,న‌టీన‌టులు. సినిమాకు ప్రధాన ఆకర్షణ తాప్సీ. శ్రీనివాస్‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, తాగు బోతు ర‌మేష్ తమదైన శైలీలో నటించారు. ష‌క‌ల‌క శంక‌ర్ చేసిన స్పూఫ్‌లు బాగా న‌వ్వించాయి. మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దెయ్యం నేప‌థ్యంలో ఇదివ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కి భిన్నంగా సాగే చిత్ర‌మిది. కొన్నిసార్లు దెయ్యాలు మ‌నుషుల‌కి భ‌య‌ప‌డుతుంటాయి. దీంతో కామెడీ బాగా పండింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్  సినిమా ప్రారంభంలో సన్నివేశాలు, లాజిక్‌ లేకపోవడం. సినిమాకు తాప్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆమె భ‌య‌పెట్టింది త‌క్కువే, అలాగే న‌వ్వించిందీ లేదు.తెర‌పై బోలెడ‌న్ని పాత్ర‌లు క‌నిపిస్తాయి. అయితే ఆ స్థాయిలో మాత్రం న‌వ్వులు పండ‌లేదు. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది.  ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ క‌థ‌ని రాసుకొన్న విధానం, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన  విధానం ఆక‌ట్టుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో గతంలో వచ్చిన ఆ సినిమాలకికి  భిన్నంగా సాగే చిత్ర‌మిది. కొన్నిసార్లు దెయ్యాలు మ‌నుషుల‌కి భ‌య‌ప‌డుతుంటాయి. దాంతో కామెడీ బాగా పండింది. ఎడిటింగ్,సంగీతం బాగుంది. అనిష్ త‌రుణ్‌కుమార్ కెమెరా ప‌నిత‌నం చ‌క్క‌గా కుదిరింది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

Anando Brahma movie Review
తీర్పు:

మ‌నుషుల్ని చూసి దెయ్యం భ‌య‌ప‌డే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఆనందో బ్రహ్మ. కాన్సెప్ట్‌, క‌థ‌నం,న‌టీన‌టులు,కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా ప్రారంభ సన్నివేశాలు, అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం మైనస్ పాయింట్స్.  మొత్తంగా సగటు ప్రేక్షకుడు వీకెండ్‌లో హాయిగా నవ్వుకునే మూవీ ఆనందో బ్రహ్మ.

విడుదల తేదీ:12/08/2017
రేటింగ్ :  3.25|5
న‌టీన‌టులు:  తాప్సి,శ్రీనివాస్‌రెడ్డి
సంగీతం: కృష్ణ కుమార్
నిర్మాత‌లు: విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: మహి వి.రాఘ‌వ్‌

- Advertisement -