జగన్‌ పాత్రలో నటించట్లేదు:సూర్య

404
suriya
- Advertisement -

వైఎస్ రాజశేఖర్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో హీరో సూర్య నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఖండించారు సూర్య. జగన్ పాత్రను తాను చేయడం లేదని తెలిపారు. ‘ఎన్జీకే’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఏపీలో టీడీపీని మట్టికరిపిస్తూ ఒంటరిగా వైసీపీని అధికారంలోకి తెచ్చారు జగన్‌. వైసీపీ అధినేత పాత్ర చుట్టూ యాత్ర 2 ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి జగన్ బయటకు రావడం, కోర్టు కేసులు, జైలు శిక్ష, యాత్ర, ముఖ్యమంత్రి పదవి సాధించడం వంటి అంశాలు ఈ మూవీలో ఉండనున్నాయట.

- Advertisement -