హార్రర్ సినిమాలో సాయిపల్లవి

194
Sai Pallavi To Act In A Horror Movie
- Advertisement -

సాయి పల్లవి.. ఇప్పుడు ఈ పేరు టీ-టౌన్ లో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే సాయి పల్లవి కంటే కూడా భానుమతి అంటేనే జనాల్లో మాంచి క్రేజ్ ను సంపాదించుకుంది. మలయాళంలో మలర్ గా పేరున్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు పరిశ్రమకు చక్కని చుక్కలా కనిపిస్తుంది. సాయి పల్లవి తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే ఫిదా సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించిన విషయం తెలిసిందే. ‘ఫిదా’ సినిమా హిట్ తరువాత తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది సాయిపల్లవి. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం పట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

సాయి పల్లవి ఇంతవరకు మంచి అమ్మాయిగా అందరూ ప్రేమించాలని అనుకునే అమ్మాయిలా కనిపించింది. కానీ మొదటసారి ఈ హారర్ సినిమాలో సీరియస్ రోల్ చేయబోతుందట. థ్రిల్లర్ సినిమాలో ఉండే మలుపులు సాయి పల్లవి నటన ఈ సినిమాకు ప్లస్ అవ్వబోతున్నాయని నమ్మకంగా చెబుతున్నారు ఆ మూవీ టీమ్. ఈ కథలో ఉండే ట్విస్ట్ లు సాయి పల్లవికి తెగ నచ్చేశాయట. అందుకనే కథ విన్న వెంటనే ఓకే చెప్పేసిందట సాయిపల్లవి.

ఇప్పుడు ఈ ప్రేమమ్ టీచర్ నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఒక సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా కూడా ఒకటి రెండు నెలలో విడుదల కావచ్చు. ఇదే కాకుండా నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (MCA) సినిమా కూడా ముగింపు దశకు వచ్చింది. మొత్తానికి సాయి పల్లవి తనకు నచ్చిన కథలనే చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

- Advertisement -