యాక్షన్‌తో సీన్‌లోకి ఎంటరైన సాహో !

257
Prabhas starts shooting for Saaho
Prabhas starts shooting for Saaho
- Advertisement -

బాహుబలి ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ ఏం సినిమా చేయడబోతున్నాడనే విషయంలో చాలా కాలం సస్పెన్స్ కొనసాగింది. ‘సాహో’ సినిమా ఖరారైన తర్వాత హీరోయిన్ విషయంలోనూ అదే తరహా సస్పెన్స్ సాగింది. ప్రభాస్ సరసన ఎవరు హీరోయిన్ గా చేస్తున్నరనే విషయంలో కొంత కాలం అనుష్క పేరు, తర్వాత పలువురు ఇతర హీరోయిన్ల పేర్లూ వినిపించాయి. అయితే ఎట్టకేలకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఈ చిత్ర షూటింగ్ మొద‌లై చాలా రోజులు అవుతున్న‌ప్ప‌టికి ప్ర‌భాస్ మాత్రం నిన్న‌టి వ‌ర‌కు టీం తో క‌ల‌వలేదు.

150 కోట్ల బడ్జెట్ తో ‘సాహో’ షూటింగ్ కొన్ని రోజుల క్రిందటే మొదలైంది. ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసిన సాహో టీం.. రెండవ షెడ్యూల్ షూటింగ్ నేడు మొదలైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో 5 కోట్ల బడ్జెట్ తో వేసిన భారీ సెట్లో ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగులో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ప్రభాస్‌కి సంబంధించిన కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సీన్స్ ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. వచ్చేనెలలో ‘దుబాయ్’ లో జరగనున్న షెడ్యూల్ లో శ్రద్ధా కపూర్ జాయిన్ కానుంది. సాహో టీంతో జాయిన్‌ కావడానికి, ప్రభాస్‌తో నటించడానికి చాలా అతృతంగా ఎదురుచూస్తున్నట్లు శ్రధ్ద కపూర్ ట్వీట్‌ చేసింది.

Beautiful-Shraddha-Kapoor-Images

ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడు గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు. సముద్ర గర్భంలో ప్రభాస్ చేసే సాహస విన్యాసాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనేది ఈ సినిమా యూనిట్ చెబుతోన్న మాట. యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్న సాహో సినిమాను డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. సుమారుగా 200 కోట్లు బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు – తమిళ్ – హింది – మలయాళం లో విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -