అమ్మ నివాసం… ఓ రహాస్యమే….

277
Amma's Poes Garden mystery..
- Advertisement -

దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనంతలోకాలకు వెళ్లిపోయేవరకు జయలలితకు సంబంధించిన అన్ని విషయాలూ అత్యంత రహస్యంగానే ఉన్నాయి. 2016లో చివరిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు నెలల్లోపే ఆమె మరణించారు. జయలలితను ఆరాధించేవాళ్లు, పూజించేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఆమెను ద్వేషించేవాళ్లు, అసలు పట్టించుకోనివాళ్లు కూడా అంతేమంది ఉండేవారు.

జయ జీవితం వడ్డింజిన విస్తరీ కాదు. ఎన్నో అవమానాలు…చిత్కారాలు..అంతకుమించి అసెంబ్లీ సాక్షిగా దురాగతం..అన్నింటిని దిగమింగింది. అవమానాలకు కుంగిపోలేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంది. తనను చీ కొట్టిన వారితో జేజేలు కొట్టించుకుంది. తమిళనాట అమ్మగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక జయకు సంబంధించిన ఏ వార్తైన సెన్సేషనే.

ఇక జయ నివాసం పోయస్ గార్డెన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోయస్ గార్డెన్. ఈ పేరు చెబితేనే చెన్నైలోని వీవీఐపీల ఇళ్లన్నీ గుర్తుకు వస్తాయి. వాటిల్లో మొదట చెప్పే పేరు ‘వేద నిలయం’. తన తల్లి వేదవల్లి గుర్తుగా, జయలలిత 1967లో రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేసిన ఇల్లు. దాదాపు 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇంటి విలువ ఇప్పుడైతే రూ. 45 కోట్లకు పైమాటే. ఇక ఈ ఇంటికి పొరుగున ఉండేది సూపర్ స్టార్ రజనీకాంత్.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ‘వేద నిలయం’లో ఎన్నో రహస్యాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులోకి వెళ్లాలంటే జయలలిత అనుమతి తప్పనిసరి. ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాం ఉంటే తప్ప, మంత్రులకు సైతం ఈ బిల్డింగ్ లోకి ప్రవేశం నిషిద్ధమే. జయకు ముఖ్యనేతలు, విశ్వాసపాత్రులైన ఐఏఎస్ లకు సైతం ఇల్లంతా ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఇంట్లో 20 మందికి పైగా పనివాళ్లు ఉంటారని సమాచారం. జయతో పాటు శశికళ, ఆమె మరదలు ఇళవరసి, 20 సంవత్సరాల వయసులో ఉన్న ఇద్దరు యువతులు ఇక్కడుంటారు.జయ తీసుకోవాల్సిన మాత్రల నుంచి మేకప్ వరకూ వీరిద్దరే చూసుకుంటారని తెలుస్తోంది. ఇక ఇంటి ఆవరణలోనే ఓ చిన్న గుడి వుంది. జయలలిత ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటి నుంచి ఇంట్లోకి వచ్చినా, ఈ వినాయకుడి దర్శనం తప్పనిసరి.

జయలలిత జీవితం మొత్తం పోరాటాల మయం. చివరకు మృత్యువుతో కూడా చిట్ట చివరి నిమిషం వరకు ఆమె పోరాడుతూనే ఉన్నారు. స్కూలు బోర్డు పరీక్షలలో టాపర్‌గా నిలిచిన తర్వాత తాను లాయర్ కావాలని ఎంతగానో అనుకున్నారు గానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లి బలవంతం మీద సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. తారాపథానికి వెళ్లినా ఏనాడూ వాణిజ్య ప్రకటనల జోలికి వెళ్లలేదు, ఎవరినీ రానివ్వలేదు. ఆస్తుల మీద కేసుల విషయంలో కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరగా సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. 74 రోజులుగా మృత్యువుతో పోరాడిన జయ చివరికి పోరాడి ఓడిపోయింది.

- Advertisement -