ప్రధాని రేస్ లో అమిత్ షా?

124
- Advertisement -

బీజేపీ పార్టీ నుంచి ప్రధాని రేస్ లో ఎవరుంటారు అంటే టక్కున తడుముకోకుంటా నరేంద్ర మోడి పేరు చెబుతారెవరైనా.. కానీ రాబోయే రోజుల్లో ఈ పేరు మరాబోతుందా ? ప్రధాని అభ్యర్థిత్వానికి బీజేపీ నుంచి మరో వ్యక్తి మోడీకి పోటీ ఇవ్వనున్నారా ? అంటే అవునేమో అనే సమాధానాలు తాజాగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల వెలువడిన ఓ సర్వేలో అమిత్ షా పేరు ప్రస్తావనకు రావడం. తాజాగా ఇండియా టుడే సి ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బీజేపీ నుంచి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షా ను చూడాలని 29 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు ఆ సర్వే వెల్లడించింది..

దీంతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మళ్ళీ నరేంద్ర మోడీనే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే 2029 నాటికి మాత్రం ఈ పేరు మారే అవకాశం ఉందని తాజా సర్వే చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రధానిగా విధులు నిర్వహించిన మోడీ 2024 లో కూడా తానే బరిలో ఉన్నాడు. ఇక 2029 లో కూడా మళ్ళీ మోడీనే ప్రధాని అభ్యర్థి గా ఉండే పార్టీలో ముసలం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం .ప్రస్తుతం బీజేపీలో మోడీ తరువాతి స్థానంలో అమిత్ షానే ఉన్నాడు. పార్టీకి సంబంధించిన ఎలాంటి వ్యూహరచనలోనైనా అమిత్ పాత్రనే కీలకం. అందుకే 2029 నాటికి బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా అమిత్ షా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే అప్పుడు పార్టీలో మోడీ పాత్ర ఏంటన్నది కూడా ప్రశ్నార్థకమే. మరి రాబోయే రోజుల్లో కాషాయ పార్టీలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.

Also Read:పొంగులేటి వైఖరితో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్?

- Advertisement -