కోడలి దగ్గర అమితాబ్ అప్పు…

225
amitabh-aish_
- Advertisement -

నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరుగకుండా నటిస్తున్న నటుడు అమితాబ్ బచ్చన్. అమితాబ్ అంటే దేశంలో తెలీని వారుండరు. చిన్న పిల్లలకు కూడా అమితాబ్ పేరు తెలుసు. ఆయన సినిమాల్ని చూసుంటారు. ఇండియాలో మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీ అమితాబ్ బచ్చన్…. ఒకప్పుడు ఆయన డేట్స్ దొరకాలంటేనే కష్టంగా ఉండేది బిజీ బిజీ షెడ్యూల్ తో కాలంతో పరుగెడుతూ ఉండేవారు. ఇక రెమ్యునరేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమా సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ ని పెంచుకునేవారు.

amitabh-aish_

కానీ ప్రస్తుతం ఆయన అప్పులు చేయాల్సి వస్తోందని తెలుస్తోంది.  ఈ విషయాన్ని అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయా బచ్చన్‌ తన అఫిడవిట్ లో ప్రాపర్టీ డిటెయిల్స్ లో తెలిపింది.  అమితాబ్ బచ్చన్, తన కోడలు ఐశ్వర్యా రాయ్ నుంచి రూ. 21.4 కోట్ల అప్పు తీసుకున్నారట. అమితాబ్‌ బచ్చన్‌ ఐశ్వర్య నుంచే కాకుండా  కుమారుడు అభిషేక్ నుంచి ఏకంగా రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నాడట.  అంతే కాకుండా జయబచ్చన్‌ తన భర్త అమితాబ్‌ బచ్చన్‌ కు 104 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని తెలిపింది. ఏడు పదుల వయసులోనూ బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ, కోట్లకు పడగలెత్తిన అమితాబ్, కొడుకు, కోడలి నుంచి అప్పులు తీసుకోవడం ఏంటోనని జనాలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -