చైతూ ‘సవ్యసాచి’ రెగ్యులర్ షూటింగ్..

187
Naga Chaitanya's Savyasachi Movie Regular Shooting
- Advertisement -

అక్కినేని నాగచైతన్య యుద్ధం శరణం చిత్రం ఘోర పరాజయం పొందడంతో కొంచం ఆలోచనలో పడ్డాడని అనిపిస్తుంది .అందుకే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. సవ్యసాఛి పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమానే తన నెక్ట్స్ సినిమా అంటూ కన్ఫామ్ చేశాడు. సవ్యసాచి సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

Naga Chaitanya's Savyasachi Movie Regular Shooting

అయితే ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. చైతూ – సమంతల పెళ్లి కారణంగా ఆలస్యమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే యాక్షన్ ఇమేజ్ కోసం అక్కినేని నాగచైతన్య ఎప్పటి నుండో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇంతకుముందు చందూ మొండేటి – చైతూ కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమమ్’ సూపర్ హిట్ అయింది. దాంతో ఈ ప్రాజెక్టుపై యూత్ లో ఆసక్తి వుంది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, డిఫరెంట్ కాన్సెప్ట్ తో చందూ మొండేటి తెరకెక్కించనున్నాడు. నాగ్ కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చేసిందని అంటున్నారు. ‘కార్తికేయ’ ‘ప్రేమమ్’ తరువాత చందూ మొండేటి చేస్తోన్న ఈ సినిమా, ఆయనకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

- Advertisement -