చరిత్ర సృష్టించిన అమిత్ పంగల్..!

365
amith
- Advertisement -

2019 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత యువబాక్సర్ అమిత్ పంగల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రష్యాలోని ఎక్ తెరీనాబర్గ్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ 52 కిలోల విభాగం ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ఉజ్బెక్ స్టార్ బాక్సర్ షకోబిడిన్ జోయిరోవ్‌తో అమిత్ పోరాడి ఓడి రజతపతకంతో సరిపెట్టుకొ్న్నాడు.

Amit panghal

అయినప్పటికీ అమిత్ పంగల్ ఓ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన తొలి బాక్సర్‌గా అమిత్ రికార్డులకెక్కాడు. అమిత్ ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లి మరో చరిత్ర సృష్టించాడు.

మరో విభాగంలో భారత్‌కే చెందిన మరో బాక్సర్ మనీశ్ కౌశిక్ సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో ఒకే పోటీల్లో రెండు పతకాలు భారత్‌కు లభించాయి. ఇది కూడా ఓ రికార్డే. గతంలో విజేందర్‌సింగ్, వికాశ్ కృష్ణన్, శివథాపా, గౌరవ్ బిదూరిలు కాంస్య పతకాలు సాధించారు. అయితే, వీరంతా వేర్వేరు సంవత్సరాల్లో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో ఈ పతకాలు అందుకున్నారు.

- Advertisement -