- Advertisement -
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పాటు ఫైజర్ బయో ఎన్‌టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్ టీకాలు సైతం వచ్చే ఆరువారాల్లో అందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అమెరికాలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. 60 మిలియన్ మోతాదుల నిల్వ ఉండగా.. ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్‌డీఏ) క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తోంది. అనుమతి లభిస్తే కంపెనీ వాటిని వివిధ దేశాలకు రవాణా చేయనుంది.
- Advertisement -