కరోనా ట్రీట్‌మెంట్…గైడ్‌లైన్స్ విడుదల

106
coronavirus
- Advertisement -

కరోనా కొత్త చికిత్స విధానాన్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కొత్త గైడ్‌లైన్స్ రూపకల్పన చేసింది. కోవిడ్ చికిత్సలో ప్లాస్మా వినియోగాన్ని తొలగించిన కేంద్రం…..మైల్డ్ కేసులకు మాత్రమే హోం ఐసోలేషన్ ఉండాలని సూచించింది.

మోడరేట్ కేసులను వార్డులో, సీరియస్ కేసులను ఐసీయూలో చికిత్స అందించాలని….శ్వాసలో ఇబ్బందిలేకపోతే మైల్డ్ కేసులుగా వర్గీకరించింది.నిమిషానికి 24 సార్ల కంటే ఎక్కువగా శ్వాసతీ సుకోవడం (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది), ఆక్సిజన్ శాతం 93కు దిగువన, 90కి ఎగువన ఉంటే మోడరేట్ కేసుగా నమోదుచేయాలన్నారు.

నిమిషానికి 30 సార్ల కంటే ఎక్కువగా శ్వాసతీసుకోవడం (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది), ఆక్సిజన్ స్థాయి 90 శాతం కంటే తక్కువ ఉండడం సీరియస్ కేసుగా వర్గీకరణ మోడరేట్, సీరియస్ కేసులకు మాత్రమే రెమ్‌డెసివిర్ వినియోగించాలన్నారు. సీరియస్ కేసుల్లో (ఆఫ్ లేబుల్) ‘టాసిలిజుమాబ్’ వినియోగం (కేసు తీవ్రత పెరిగిన 24-48 గంటల్లోగా) అని తెలిపింది.

- Advertisement -