- Advertisement -
కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ దాదాపుగా 190కి పైగా దేశాలకు విస్తరించగా అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతోంది.
కరోనా పాజిటివ్ కేసుల్లో చైనాను దాటేసింది అమెరికా. అమెరికాలో 83,500 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చైనాలో 81,782 మందికి, ఇటలీలో 80 వేల 589 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఈ లెక్కలు వెల్లడించింది.
అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. దేశవ్యాప్తంగా 552000 పరీక్షలు చేసినట్లు చెప్పారు.
ఇక ఇప్పటివరకు చైనాలో కరోనా వల్ల 3291 మంది, ఇటలీలో 8215 మంది మరణించారు.
- Advertisement -