పాల సేకరణ, సరఫరాపై చర్యలు- మంత్రి తలసాని

400
talasani
- Advertisement -

దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికి 694కి చేరింది. ఇవాళ ఒక్క రోజే 88 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుండి ఇప్పటి వరకు 45మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య శాఖ సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 45 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పాల సేకరణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి లాక్ డౌన్ అమలు చేయడం జరుగుతుంది. పాల సేకరణ, సరఫరాపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ..నిత్యావసర వస్తువులైన పాలు, పాల పదార్ధాల పంపిణీకి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నిరంతరాయంగా పాల సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.

పాల సేకరణకు గ్రామాలకు వెళ్ళే వాహనాలను పలు గ్రామాలలోని ప్రజలు అనుమతించడం లేదు. పాల సేకరణకు సహకరించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, పాల సంఘాల అధ్యక్షులు చొరవ తీసుకోవాలి. పాల సరఫరా చేసే వాహనాలకు ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను ఆదేశించాలని సీఎస్‌ కు సూచించడం జరిగింది. పశుసంపద ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. పశువుల దాణా, కోడిగ్రుడ్లు, చేపలు రవాణా వాహనాలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని ఆధికారులను మంత్రి ఆదేశించారు.

- Advertisement -