అమలా పాల్‌ ‘ఆడై’ మూవీ ఫస్ట్‌లుక్‌..

207
- Advertisement -

సంచలనాలకు కేరఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది అందాల భామ అమలా పాల్‌. సాధారణంగా వివాదాస్పద విషయాలతో చాలా మంది పేరును చెడగొట్టుకోవడమో, అవకాశాలను కోల్పోవడమో జరుగుతుంది. కానీ అమలాపాల్‌ విషయం వేరు. ఏదో సంఘటనతో వార్తల్లో ఉండే ఈ కేరళాకుట్టికి అవి తన కేరీర్‌కు మేలు చేస్తుంటాయి. ఆ విధంగా ఈ అమ్మడు లక్కీ అనే చెప్పాలి. మైనా చిత్రంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అమలాపాల్‌ ఆ తరువాత గ్లామర్‌ తారగా మారిపోయింది. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్నా, వివాహ రద్దు తరువాత మళ్లీ నటించడం మొదలుపెట్టింది అమలా పాల్‌.

Amala Paul

ఇక అమల పాల్ నటించిన తాజా తమిళ చిత్రం ‘ఆడై’. అంటే డ్రెస్‌ (దుస్తులు) అని అర్థం. ఈ సినిమా క్యాప్షన్ యారోగెంట్.. అడాషియస్.. ఆర్టిస్టిక్ అని పెట్టారు. తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్‌ లుక్‌ను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు విడుదల చేయగా గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫస్ట్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది.

దెబ్బలు తగిలి రక్తం కారుతూ.. పెద్దగా ఏడుస్తూ ఒక ఇనప రాడ్ ను పట్టుకొని ఎడమ మోకాలును నెలకు ఆనించి కూర్చుంది. ఇక బట్టలంతా చిరిగిపోయి ఉన్నాయి. వాటిని కరెక్ట్ గా అయితే బట్టలు అనలేం… మానం కాపాడుకొనేందుకు గుడ్డపేలికలను శరీర భాగాలకు చుట్టుకుంది అంతే. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అమలదే. రత్న కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో అయన ‘మెయాదామాన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. వీ స్టూడియోస్ వారు ఈ సినిమాకు నిర్మాతలు.

- Advertisement -