భారీస్థాయిలో అల్లు స్టూడియోస్ నిర్మాణం..

103
Allu Arjun

టాలీవుడ్‌ సీనియర్‌ హాస్య నటుడు,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు బన్నీ. అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.

ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

గండిపేట్ ప్రాంతంలో 10 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ స్టూడియోస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు అల్లు అర‌వింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్ర‌క‌టించారు. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఫిల్మ్ మేకింగ్ కు అనుకూలంగా ఉండేలా ఆర్ట్ ఫిలిం స్డూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. స్డూడియో నిర్మాణ పనులు కూడా త్వ‌ర‌లోనే షురూ కానున్న‌ట్టు తెలుస్తోంది. అల్లు స్డూడియో రావ‌డం ఓ వైపు ఆయ‌న అభిమానుల‌కే కాకుండా సినీ కార్మికుల‌కు కూడా మంచి వార్త‌నే చెప్పాలి. స్టూడియోతో ప‌లువురు కార్మికులు ఉపాధి దొరుకుతుంది.