బావ.. త్వరలో నిన్ను కలుస్తాః అల్లు అర్జున్

443
Ntr Allu Arjun.jpeg
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిసిమా అల..వైకుంటపురంలో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈమూవీ ఆదివారం గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈమూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మూవీ చూసిన ఎన్టీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటన అద్భుతంగా ఉందంటూ ట్విట్‌ చేశారు. ‘అల… వైకుంఠపురములో చిత్రం అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాటలు రాశారు… కంగ్రాట్స్ బావా అండ్‌ స్వామీ” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ కు రిప్లే ఇచ్చారు అల్లు అర్జున్. బావా… థాంక్యూ వెరీ మచ్. త్వరలోనే నిన్ను కలుస్తా. నీతో మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది అంటూ ట్విట్టర్ లో రిప్లయ్ ఇచ్చారు. ఇక వీరిద్దరి ట్వీట్లు చూసిన మెగా, నందమూరి అభిమానులు సంబురపడిపోతున్నారు.

- Advertisement -