బన్నీ బర్త్‌డే గిఫ్ట్..పుష్ప ఫస్ట్ లుక్!

274
allu arjun

సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీసరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

బన్నీకి ఇది 20వ సినిమా కాగా పుష్ప అనే టైటిల్‌ని ఖరారు చేశారు. స్టైలిష్ స్టార్ లుక్ చాలా ర‌ఫ్ అండ్ మాస్ అప్పీరెన్స్ కలిగివుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో చిత్తూరు నేపథ్యంలో నడిచే ఇతివృత్తమిదని, అల్లు అర్జున్‌ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడగా ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.