సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినచిత్రం ` ఓ బేబీ`. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా అటు ప్రేక్షకుల, ఇటు సినీ వర్గాల ప్రముఖుల ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది.
తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీపై స్పందించాడు.. ‘ఓ బేబీ’ సినిమా కట్టి పడేసిందని… సమంత నటన అత్యద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా చూసిన ఆయన సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛం, ఒక మొక్కను బహుమతిగా పంపారు. అలాగే డైరెక్టర్ నందినిరెడ్డి మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకుందని ప్రశంసించాడు బన్ని. దీనికి నందినిరెడ్డి స్పందిస్తూ.. నన్ను అన్ని వేళలా ప్రోత్సహిస్తున్న బన్నీకి ధన్యవాదాలు.అని తెలిపింది.