తెలుగు తెరపై విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. కమెడియన్‌గా,విలన్‌గా,హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా ఏ అవకాశం వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుని ముందుకుసాగుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై రకరకాల పాత్రల్లో కనిపించిన అజయ్ తాజాగా కొత్త లుక్‌ని ట్రై చేస్తున్నాడు.
సిక్స్ ప్యాక్ కోసం కొన్ని నెలల నుండి తీవ్రంగా వర్కవుట్స్ చేస్తున్న అజయ్ దాదాపు ఆ లుక్ రాబట్టేశారు. గతంలో కంటే స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ ప్రిపరేషన్ మొత్తం చూస్తుంటే ఆయన ఏదో పెద్ద ప్రాజెక్ట్ కోసమే రెడీ అవుతున్నారని అనిపిస్తోంది.
టాలీవుడ్ అగ్రహీరోలతో నటించి మెప్పించారు అజయ్. బన్నీతో ఆర్య,రవితేజతో విక్రమార్కుడు, మహేష్‌తో ఒక్కడు,అతడు,పోకిరి,సైనికుడు వంటి సినిమాల్లో నటించారు. ఇక హీరోగా సారాయి వీర్రాజు మూవీలో ప్రేక్షకుల మన్ననలు పొందారు.

