బన్నీ 19 టైటిల్ పోస్టర్ ఎప్పుడో తెలుసా?

377
allu arjun trivikram movie title
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రికరణ జరుపుకుంటోంది. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా నవదీప్, సుశాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్న ఇంత వరకు ఎలాంటి లుక్ లు రాకపోవడంతో నిరాశలో ఉన్నారు బన్నీ అభిమానులు. అందుకోసమే బన్నీ అభిమానులకు శుభవార్త చెప్పారు చిత్రయూనిట్.

ఈనెల 15న ఈసినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందుతోందనీ సమాచారం. ఈసినిమాకు అలకనంద అనే టైటిల్ ను పెడతారని తెలుస్తుంది.

ఇటివలే త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నింటికి అ పేరుతోనే టైటిల్ లను పెట్టారు. ఈసినిమాకు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు సమచారం. చాలా రోజుల తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హరిక అండ్ హసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

AA19

- Advertisement -