అల్లు అర్హ అడుగులు అటు వైపే

38
- Advertisement -

ఓ స్టార్ హీరో కూతురు సినిమాల్లోకి రాకుండా, ముఖ్యంగా హీరోయిన్‌ గా చేయకుండా ఆ హీరో అభిమానులు అడ్డుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులను సినిమాల్లోకి రానివ్వలేదు ఫ్యాన్స్. కానీ రోజులు మారాయి. ఇప్పుడు హీరోల కూతుర్లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రానున్న రోజుల్లో వెండి తెరపై వెలగబోయే హీరోయిన్ల లిస్ట్ లో అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఉంది. బన్నీ కూతురును భావి హీరోయిన్‌గా తీర్చిదిద్దుతోంది ఆమె తల్లి స్నేహా రెడ్డి. షార్ట్ వీడియోస్‌తో మొదలై అప్పుడే బ్రాండింగ్ స్టార్ అవ్వడానికి అర్హ సన్నద్ధం అవుతుంది.

ఇప్పటికే ఓ సినిమా చేసేసింది… తెరపై వెలగడం స్టార్టయింది… ఇంకేముంది..? క్రమేపీ అందులోకి పూర్తిగా దిగిపోవడమే… అంతా స్నేహా రెడ్డి ప్లానింగే అంటున్నారు… ఇప్పుడు అల్లు అర్హ ఇంకా చిన్న పిల్ల… భవిష్యత్తులో ఆమె ఇష్టం ఎలా మారిపోతుందనేది ఇప్పుడే చెప్పలేం, కానీ ఇప్పుడే సంపాదన అనే మాయలోకి జారిపోతుంటే.. భవిష్యత్తులో ఎందుకు ఆ సంపాదన వదలుకుంటారు ?, పైగా అర్హకి అంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ పేజీలు కూడా పుట్టుకొచ్చాయి.

ఏది ఏమైనా అల్లు అర్హ ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. ఎన్టీఆర్ దేవరలో కూడా ఆమె ఓ పాత్ర చేస్తోంది అంటున్నారు. పాపం.. బాల్యాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి… రోడ్డు మీద తిరగడం, ఫ్రెండ్స్‌తో స్కూల్ కు వెళ్లడం… బర్త్ డే పార్టీలకు వెళ్లడం…హోమ్ వర్క్ లు ఎగ్గొట్టి ఎంజాయ్ చేయడం.. మొత్తంగా ఎవరి బాల్యం అయినా ఇలాగే ఉంటుంది. కానీ, బాల్యంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న వారి పరిస్థితి మాత్రం కచ్చితంగా ఇలా ఉండదు.

Also Read:కలబందతో.. నిగారింపు సొంతం !

- Advertisement -