నవంబర్‌11న…ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

100
- Advertisement -

నాంది సినిమాతో హిట్‌ కొట్టిన అల్లరి నరేష్‌ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా మరోసారి వస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక తపించిన నరేష్‌… నాంది సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి తన మార్కెట్‌ను పదిలం చేసుకున్నారు. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు మారేడుమిలి ప్రజానీకం షూటింగ్‌ చివరి దశలో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌ సంయుక్తంగా రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మూవీ మేకర్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాను నవంబర్‌11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తున్నట్టుగా పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది. ఆనంది, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి బాలాజీ గుత్తా సహనిర్మాత కాగా, రాంరెడ్డి సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేశారు.

- Advertisement -