మల్కాజ్ గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపైల్లి హనుమంతరావ్ వ్యవహార శైలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఆ మద్య మంత్రి హరీష్ రావు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఇవి పార్టీని దెబ్బ తీసే చర్యలే అయినప్పటికి అధినేత కేసిఆర్ ఉదారత ప్రదర్శించి మల్కాజ్ గిరి టికెట్ మల్లి ఆయనకే కేయాయించారు. అయినప్పటికి మైనంపల్లి వ్యవహారశైలిలో మార్పు రానట్లే కనిపిస్తోంది. మేదక్ టికెట్ తన తనయుడికి రానందున బిఆర్ఎస్ వీడే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మార్పుపై తన వర్గం నేతలతో కూడా చర్చించారట. అటు బిఆర్ఎస్ అధిసష్టానం కూడా మైనంపల్లి విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్ గిరి టికెట్ ను మైనంపల్లికి క్యాన్సిల్ చేసి వెరేవారిని బరిలో దించేందుకు బిఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..
అయితే ఒకవేళ మైనంపల్లి బిఆర్ఎస్ విడితే.. ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం వెట్టుకుంటున్నప్పటికి హస్తం పార్టీలో ఆశించిన టికెట్లు దొరకడం కష్టమే అనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. ఎందుకంటే కాంగ్రెస్ లో సీట్ల పంపకల విషయంలో సొంత పార్టీ నేతలే గట్టి పోటీ పడుతున్నారు. ఇకపోతే కాషాయ పార్టీ మైనంపల్లికి స్వాగతం పలికేందుకు ససేమిరా అంటోంది. మైనంపల్లి వంటి వారిని బీజేపీలోకి ఎట్టి పరిస్థితిలో చేర్చుకోబోమని కమలనాథులు గట్టిగా చెబుతున్నారు. మైనంపల్లి వ్యవహార శైలి బిజెపి విధానాలు వ్యతిరేకంగా ఉన్నాయని అలాంటి వారికి బీజేపీలో స్థానం ఉండదని బీజేపీ సీనియర్ నేత రామచందర్ ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో మైనంపల్లికి బీజేపీలో నో ఎంట్రీ అనేది స్పష్టమౌతోంది. దీంతో ఒకవేళ అధికార బిఆర్ఎస్ ను విడితే మైనంపల్లి గతి అదోగాటి అవుతుందనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.
Also Read:హ్యాపీ బర్త్ డే…విశాల్