మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి:కేటీఆర్

10
- Advertisement -

కొల్లాపూర్‌ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో కాంగ్రెస్ పార్టీ గూండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణమైన హత్యకు ప్రధాన బాధ్యత ఇక్కడ మంత్రి జూపల్లి, కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.తెలంగాణలో గతంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని తెచ్చి.. నాలుగు నెలల్లోనే కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి ప్రోద్భలంతో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులపై దారుణమైన హత్యకు తెగబడ్డారు. ఈ హత్యా సంస్కృతిని ప్రోత్సహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి దారుణమైన హత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వేల సంఖ్యలో తరలివెళ్తాం అక్కడి మంత్రులు, నాయకుల ఇండ్లను ముట్టడిస్తాం. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం.. మా కార్యకర్తలను కాపాడుకుంటాం అని తేల్చిచెప్పారు.

Also Read:నటుడిని, కొత్త తరహా పాత్రలంటే ఇష్టం!

- Advertisement -