యంగ్ బ్యూటీకి టాప్ రెమ్యునరేషన్

36
- Advertisement -

‘శ్రీలీల’ టాప్ రెమ్యునరేషన్ తో టాప్ లేపుతుంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల తన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేసింది. ఈ సినిమాలోనే చాలా డెప్త్ ఉన్న పాత్రలో తన నటనతో మెప్పించింది శ్రీలీల. ఈ క్రమంలో ఆ హిట్ క్రేజ్ తోనే వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇదే క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా శ్రీలీలతో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో దిల్ రాజు ఇంటి హీరో ఆశిష్ నటిస్తుండగా ఫీమేల్ లీడ్ గా శ్రీలీల ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో శ్రీలీల నటించేందుకు గాను ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. భగవంత్ కేసరితో పాటు గుంటూరు కారం సినిమాలు కారణంగా శ్రీలీలకి బాగా డిమాండ్ పెరిగింది. అందుకే, దిల్ రాజు సినిమా కోసం శ్రీలీల కి దాదాపు 2 కోట్లు దాకా రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రాణించడం అనేది పెద్ద విషయం, అంతేకాకుండా తోటి స్టార్ హీరోయిన్స్ లాగా శ్రీలీల కూడా కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకోవడం కూడా గొప్ప విషయమే. ఆ విషయంలో శ్రీలీల మళయాళ, ముంబై హీరోయిన్స్ కి ధీటుగా వస్తుంది.

ఒక్క ‘భగవంత్ కేసరి’ తోనే శ్రీలీల కి నాలుగైదు సినిమాల దాకా ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది. కెరీర్ లో మొదటి హిట్ తర్వాత అవకాశాలు రావడం కామనే కానీ ఆ ఛాన్స్ లతో కెరీర్ ని నిలబెట్టుకోవడం జరగాలి. అందుకే శ్రీలీల ఆచి తూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఆశిష్ తో పాటుగా విజయ్ దేవరకొండ తో కూడా మరో సినిమా చేస్తుంది శ్రీలీల. ఇదే కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. తప్పకుండా మిగతా తెలుగు హీరోయిన్స్ లా కాకుండా కచ్చితంగా స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:‘దేవర’ క్లైమాక్స్ కన్నీళ్ల మయమా?

- Advertisement -