“విటమిన్ సి” ఎంత అవసరమో తెలుసా?

9
- Advertisement -

మన ఆరోగ్యాన్ని క్రమబద్దీకరించడంలో విటమిన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి వాటి కారణంగానే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. విటమిన్స్ లో చాలానే రకాలు ఉన్నాయి విటమిన్ ఏ, సి, డి, ఇ, కె, బి కాంప్లెక్స్.. ఇలా ప్రతిదీ మన శరీరానికి ఎంతో అసవరం. ఇందులో సి విటమిన్ కొంత ప్రత్యేకమైనది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపించడంలోనూ, తెల్ల రక్తకణాల సంఖ్య పెంచడంలోనూ సి విటమిన్ చాలా అవసరం. ఒకవేళ సి విటమిన్ లోపిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా ఎన్నో రోగాలు, వ్యాధులు త్వరగా ఎటాక్ అవుతాయి. విటమిన్ సి తక్కువగా ఉన్నవారు ఏదైనా వ్యాధి బారిన పడితే.. దాని నుంచి కోలుకోవడం కష్టమౌతుంది. .

ఇంకా శరీర కణజాలలను వృద్ధి చేయడంలో సి విటమిన్ ఎంతో ముఖ్యమైనది. ఎముకల పటుత్వాన్ని పెంచడంలోనూ, మృదులాస్థిని వృద్ధి చేయడంలోనూ సి విటమిన్ సహాయ పడుతుంది. కాబట్టి విటమిన్ సి శరీరంలో సరైన మోతాదులో ఉండడం చాలా అవసరం. ఒక వ్యక్తికి ప్రతిరోజూ 65 మిల్లీగ్రాములు నుంచి 90 మిల్లీ గ్రాముల వరకు సి విటమిన్ అవసరం. కాబట్టి ఇది ఏ మాత్రం తగ్గిన ఆరోగ్య సమతుల్యం దెబ్బతింటుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తప్పనిసరిగా ప్రతిరోజూ ఆహార డైట్ లో చేర్చుకోవాలి. క్యాప్సికమ్, బ్రోకలి.. వంటి వాటిలో సి విటమిన్ లభిస్తుంది. అలాగే నిమ్మ, ఆరెంజ్, కివీ, బత్తాయి, బొప్పాయి.. వంటి పండ్లలో కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా టమాటా, బంగాళదుంప, కాలిఫ్లవర్ వంటి కూరగాయల్లో కూడా సి విటమిన్ లభిస్తుంది. కాబట్టి ఇవి ఆహార చాట్ లో ఉండేలా చూసుకొని ప్రతిరోజూ సేవిస్తే శరీరానికి అవసరమైన మోతాదులో విటమిన్ సి లభిస్తుంది.

Also Read:ఈ ఆకు గురించి తెలిస్తే.. తినకుండా ఉండలేరు!

- Advertisement -