11న కౌంటింగ్…పార్లమెంట్ సమావేశాలు

223
election counting
- Advertisement -

పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఓటరు తమ తీర్పును బ్యాలెట్ రూపంలోనిక్షిప్తం చేశాడు. ఇక తేలాల్సింది నేతల భవితవ్యం. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పోటీ పడిన 1821 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈనెల11 మంగళవారం నాడు తేలనుంది. మరోవైపు అదేరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

తెలంగాణాలోని 31 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 44 కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కోనియోజకవర్గానికి 15 బెంచీలు ఏర్పాటు చేశారు. ఒక బెంచిపై రిటర్నింగ్ ఆఫీసర్ , అబ్జర్వర్ ఉంటారు. వీళ్లుఎప్పటికప్పుడు కౌంటింగ్ ను పర్యవేక్షిస్తూ ఫలితాలను ప్రకటిస్తుంటారు.

మరోవైపు ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఒక రోజు ముందుగానే డిసెంబర్ 10వ తేదీన రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇవే చివరి పార్లమెంట్ కానున్నాయి. డిసెంబర్ 11న
వెలువడే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై ఉంటుందని భావిస్తున్నారు.

సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ నెలలోనే ప్రారంభం అవుతాయి. కానీ డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడం ఇది రెండోసారి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆలస్యమయ్యాయి.

- Advertisement -