ఓటర్లు…సిగ్గుపడాలి

247
koratala
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌లో తప్ప మిగితాచోట్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అయితే గ్రేటర్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఎన్నికల వేళ ఏం’జాయ్‌’ చేయడానికే ప్రజలు ఆసక్తికనబర్చారు. ఇందులో విద్యావంతులు, ఉద్యోగులే అధికం.

నగరంలో పోలింగ్‌ శాతం తగ్గడంపై దర్శకులు కొరటాల శివ స్పందించారు. అర్బన్‌ ఓటర్లు సిగ్గుపడాలి. మధ్యాహ్నం 3 గంటల వరకు 35 శాతం పోలింగేనా..? హైదరాబాద్‌కు ఏమైంది..? అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పోలింగ్‌కు ముందు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్‌ రోజును సెలవు దినంగా పరిగణిస్తుండడంతో గత కొన్నేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా నగరంలో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుంది. రాష్ట్ర సగటు 70 -75 శాతంగా ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం 50-52 శాతం దాటకపోవడం గమనార్హం.

https://twitter.com/sivakoratala/status/1070993602510241792

- Advertisement -