నేడే…మహాబతుకమ్మ

256
all set for Maha Bathukamma
- Advertisement -

ఉయ్యాలపాటలతో ఎల్బీ స్టేడియం హోరెత్తుతోంది. వాడవాడలా పచ్చపచ్చని తంగేడుపూలు, సిల్కుసిల్కు గూనుగ పూలు సోయగంతో తెలంగాణ పూల వనంలా మారింది.  ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహాబతుకమ్మను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది మహిళలతో మహా బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 427 మండలాల నుంచి మహిళలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కోసం మూడువేల మంది మహిళలు తంగేడుపూల ఆకారంలో నిలుచొని బతుకమ్మ ఆడనున్నారు

సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఆటపాటలతో మహాబతుకమ్మ వేడుకగా సాగనుంది. ఈ వేడుకలో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రుల సతీమణులు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, మహిళానేతలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు.

మహా బతుకమ్మకు తరలివచ్చే ఆడబిడ్డలకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.మంచినీళ్లు, భోజన వసతి.. ఇలా అన్ని ఏర్పాట్లును కంప్లీట్ చేశారు.  మహాబతుకమ్మ జరిగే ఎల్బీ స్టేడియం పరిసర మార్గాల్లో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.  గత సంవత్సం 9252 మంది మహిళలు ఒకేచోట బతుకమ్మ ఆడి గిన్నిస్ రికార్డును నెలకొల్పిన  సంగతి తెలిసిందే.

ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో సోమవారం నిర్వహించిన 31అడుగుల మహాబతుకమ్మ ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ఆఫ్‌ రికార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలంగాణ బుక్‌ఆఫ్‌ రికార్డుల్లో నమోదైన పత్రాలను ఉత్సవాల నిర్వాహకుడు కవి, ఉపాధ్యాయుడు మేకల రాజశేఖర్‌ గౌడ్‌కు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అందజేశారు. కాగా, జగిత్యాల లో బల్దియా ఆధ్వర్యంలో 7 క్వింటాళ్ల పూలను ఉపయోగించి, 16 అడుగుల బతుకమ్మను రూపొందించారు.

- Advertisement -