గ్రేటర్‌ ఎన్నికలకు అంతా సిద్ధం..

35
ghmc

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డీఆర్‌సీ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ పూర్తైంది. డీఆర్‌సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్‌ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ జరగనుంది. ఎల్బీనగర్‌ జోన్‌లో 5, చార్మినార్‌ జోన్‌లో 6 డీఆర్‌సీ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలోని 30 డీఆర్‌సీ కేంద్రాల్లో పోలింగ్‌ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. పోలింగ్‌ సామాగ్రితో పాటు కరోనా కిట్లు, శానిటైజర్ల పంపిణీ జరగనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 28,683 బ్యాలెట్‌ బాక్సులను వినియోగించనున్నారు.

ఈసారి జీహెచ్ఎంసీ బరిలో 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256. ఇక, పోలింగ్ కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా 2,336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 1,207 అతి సున్నితమైన, 279 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా ఎస్ఈసీ గుర్తించింది. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు.

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. జోన్ల వారీగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారీగా ఇన్చార్జి ఏసీపీ, సీఐలను నియమించారు.

మొత్తం ఓటర్లు: 74,44,260
పురుషులు: 38,77,688
స్త్రీలు: 35,65,896
ఇతరులు: 676
మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు: 79,579
రాంచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు: 27,948