ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసుల..

62
corona

ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో కేవలం 381 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు 934 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,68,064 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 6,992కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కేసులు, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 7 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.