ప్రతిష్మాత్మక ఫార్ములా రేస్‌కు హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్ లో జరగనున్న రేసుతో ఫార్ములా E మొదటిసారిగా భారతదేశానికి చేరుకుంటుంది. అంతేకాదు ఫార్ములా 1 ఇండియన్ తర్వాత దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. దీనికి హైదరాబాద్ ఆతిథ్యం దక్కించుకోవడం గొప్ప విషయం.
ఈ రేసు కోసం హెచ్‌ఎండీఏ హుస్సేన్ సాగర్ చెరువు సమీపంలో రేస్ కోసం అనువైన ట్రాక్ ను ఏర్పాటు చేస్తోంది. ఫార్ములా రేసింగ్ కోసం సుమారు 2.8 కిలో మీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తుండగా ఈ రేస్‌లో పాల్గొనే డ్రైవర్ల విశ్రాంతి గదులు, ప్రేక్షకుల గ్యాలరీలను రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకు 9 నగరాల్లో మాత్రమే ఈ రేస్ నిర్వహించారు.
రేసు సందర్భంగా సుమారు 200 కి.మీ. వేగంతో కార్లు దూసుకెళ్తాయి. వాటికి తగ్గట్టుగా ట్రాక్ ఏర్పాటు చేస్తుండగా మొత్తం 11 ప్రాంతాల్లో మలుపులు ఉంటాయి. ట్రాక్ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 19,20తో పాటు..డిసెంబర్ 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో చెట్లను తొలగించి రీలొకేట్ చేశారు. ఫార్ములా ఈ రేస్లో 5 టీంలు, 20 కార్లు పాల్గొంటాయి. ఇందులో మహీంద్రా, జాగ్వర్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఈ రేస్ 280 కిలోమీటర్ల మేర మాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుక బై షో ద్వారా టికెట్ల అమ్మకాలను నిర్వాహకులు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..