చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి..

302
- Advertisement -

చేప మందు పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మృగ శిర కార్తె సందర్బంగా బత్తిని సోదరులు ఇచ్చే ఈ చేప ముందు కోసం ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ చేప మందు పంపిణీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ చేప మందు కోసం ఇప్పటికే దేశ నలుముల నుంచి భారీగా తరలి వచ్చారు.

వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, వీఐపీ లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాడు చేశారు. చేప మందు పంపిణీ కోసం మొత్తం 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు లక్షా 60 వేల కోర్ర మేను చేప పిల్లలను సిద్దం చేసినట్లు మత్సశాఖ అధికారులు తెలిపారు.

fish prasadam distribution

ఇక శంషాబాద్ విమానాశ్రయం,సికింద్రాబాద్,నాంపల్లి,కాచిగూడ  రైల్వే స్టేషన్స్,,యంజీబీఎస్‌,జేబీఎస్‌ బస్ స్టేషన్స్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు నేరుగా వచ్చేందుకు ఆర్‌టీసీ 100 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఇక అక్కడికి వచ్చిన వారికి 3 లక్షల 50 వేల వాటర్ ప్యాకెట్లు సిద్దం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు.

ఈ చేప ముందు పంపిణి 1845 నుంచి కొనసాగుతున్నది. వరుసగా మూడు ఏళ్ళు పాటు చేప మందు స్వీకరిస్తే ఆస్తమా రోగం నయం అవుతుందనిటు చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని సోదరులు అన్నారు.

- Advertisement -