బూస్టర్ డోస్ పంపిణీకి సర్వం సిద్ధం..

113
booster dose
- Advertisement -

18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 10(రేపటి) నుండి దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ -19 బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

ఫస్ట్‌ ,సెకండ్‌ డోసుల కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతూనే ఉందని తెలిపింది. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకుని తొమ్మిది నెలలు పూర్తి అయిన తర్వాత బూస్టర్ డోస్‌కు అర్హులు.

ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడినవారు 2.4 కోట్ల కంటే ఎక్కువ ముందు బూస్టర్‌ డోసు తీసుకున్నారు. దేశంలోని మొత్తం జనాభాలో 15 ఏళ్లు పైబడినవారిలో 96 శాతం మంది కనీసం ఒక కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌ను పొందారు.

- Advertisement -