బూస్టర్ డోస్‌పై కేంద్రం ఫోకస్..!

87
dose
- Advertisement -

వ్యాక్సినేషన్‌తో కరోనాకు మరింత చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ మెజారిటీగా పూర్తిచేయగా తాజాగా బూస్టర్ డోస్‌పై దృష్టి సారించింది.

18 ఏళ్ల పైబడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. రెండో డోస్ తీసుకున్నాక 9 నెలలు లేదా 39 వారాల తరువాత బూస్టర్ డోస్‌కు కేంద్రం అనుమతి ఇస్తుంది.

ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో బూస్టర్ డోస్‌లపై దృష్టిసారించింది. ఇప్పటివరకు 181కోట్ల 24లక్షల 97వేల 303 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా త్వరలోనే బూస్టర్ డోసుల పంపిణీ స్టార్ట్ చేయనున్నారు.

- Advertisement -