జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్:ఈసీ

10
- Advertisement -

జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్‌ రోజు ఎన్నికల వార్తలను కవర్‌ చేసే జర్నలిస్టులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

పోలింగ్‌ రోజున విధుల్లో ఉండే 13 అత్యవసర శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ ఓటు హక్కును ఈసీ కల్పించింది. ఎన్నికల రోజు విధుల్లో ఉండే జర్నలిస్టులు సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్వే, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో, విద్యుత్‌, కుటుంబం, వైద్య సంక్షేమం, ఆర్టీసీ, సివిల్‌ సప్లయ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోలింగ్‌ రోజు ఎన్నికల్లో విధుల్లో ఉండే మీడియా ప్రతినిధులు, ఫైర్‌ సర్వీసెస్‌ అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు.

Also Read:Pawan:టార్గెట్ పిఠాపురం..జగన్ మాస్టర్ ప్లాన్!

- Advertisement -