సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. . ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.
కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్.. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఊతమిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.. టీ హబ్-2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించింది.టీ హబ్ -2 భవనం ఎంతగానో ఆకట్టుకుంటుందని సానియా మీర్జా ట్వీట్ చేయగా, అద్భుతంగా ఉందని సైనా నెహ్వాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
. ఆ భవనాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సమంత అన్నారు. టీ హబ్ భవనం హైదరాబాద్‌కు ఎంతో గర్వకారణం అని సినీ నటుడు సందీప్ కిషన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ చొరవకు వందనాలు.. భవనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పీవీ సింధు ట్వీట్ చేశారు.
ఇక గగన్ నారంగ్ స్పందిస్తూ.. నిన్న ఆ భవనం ముందు నుంచి వెళ్తున్నప్పుడు.. దాని చూసి మురిసిపోయాను. ఆ ఫ్యాన్సీ బిల్డింగ్‌ను చూడాలని కారును తిప్పాను. దగ్గరికి వెళ్లి చూడగా అది టీ హబ్ అని అర్థమైపోయింది.మంత్రి కేటీఆర్‌కు వందనాలు అంటూ ట్వీట్ చేశారు.హైదరాబాద్ టెక్ ఎకోసిస్టమ్‌కు భారీ ముందడుగు! చాలా గర్వంగా ఉందన్న హీరో మహేశ్ బాబు
భవిష్యత్తు కోసం,యువ వ్యాపారాలకు ఇటువంటి సానుకూలత మరియు ఆశాజనక చాలా ఉద్యోగాలు సృష్టించబడతాయి అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు..