ఆత్మవిశ్వాసంతో చదవండి.. విజయం మీదే..!

26
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఈ 60 రోజుల శిక్షణ పూర్తయిందంటే. మీరు మొదటి ఎక్కినట్టే అని మీకు ఒక బలమైన సంకల్పం ఏర్పడిందన్నారు. కొంత మంది ఉద్యోగాలు సాధించి మిగతా వారు మిగిలినా ఎవరూ నిరాశ చెందవద్దని మీరు జీవితంలో స్థిరపడే వరకు మిమ్మల్ని వదలిపెట్టమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేట్ కానీ, ఇతర ఉద్యోగాలు సాధించేందుకు అన్ని సహకారాలు తాము అందిస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -