కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పరిపాలనను అడ్డకుంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తెలంగాణ సీఎం, పంజాబ్ సీఎంతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ఢిల్లీ ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదలు తెలిపారు. 2015, ఫిబ్రవరిలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. మేలో మోదీ సర్కార్ ఓ నోటిఫికేషన్ తెచ్చి తమ ప్రభుత్వాన్ని కూల్చారన్నారు. సర్వీస్ సంబంధిత విషయాల్లో గతంలో షీలా దీక్షిత్ వద్ద కంట్రోల్ ఉండేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టేసి… ఆర్డినెన్స్ తేవడం అంటే న్యాయం కోసం ప్రజలు ఎక్కడికి వెళ్తారని ఆయన అడిగారు. ఢిల్లీ ప్రజలను ఇది అవమానించడమే అన్నారు. నాన్ బీజేపీ సర్కార్లను కూల్చివేయడం బీజేపీకి అలవాటు అయ్యిందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా తాను ప్రజల తరపున తిరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ గవర్నరే పాలన చేయాలనుకుంటే అప్పుడు సీఎంని ఎన్నుకోవాల్సి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. నాన్ బీజేపీ పార్టీలు అన్ని ఒక్కటి అయితేనే బీజేపీ ఢీకొట్టగలమని అన్నారు. ఆజాదీని రక్షించుకోవాలంటే మోదీని ఓడించాలని కేజ్రీ వాల్ పిలుపునిచ్చారు.
పంజాబ్ సీఎం మాట్లాడుతూ..దేశ ప్రజాస్వామ్యాన్ని కాపడేందుకే తాము ఈ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇవాళ ఢిల్లీలో జరుగుతోందని కానీ అక్కడ చేసేది ఏమీ లేదని అందుకే తాము ఆమీటింగ్ను బహిష్కరిస్తున్నట్టు మాన్ తెలిపారు.
Also Read: CMKCR:మోదీ ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు