CMKCR:మోదీ ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు

36
- Advertisement -

కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం మండిపడ్డారు. కేంద్రం అధికారంతో రాష్ట్రాలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయన్నారు. ప్రగతి భవన్‌లో ఢిల్లీ పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్‌ భగవంత్‌ మాన్‌లతో కలిసి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెడుతూ పనిచేయనీయడం లేదన్నారు.

చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో నాన్ బీజేపీ ప్రభుత్వాల వెంబడి పడుతున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వంలో సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీల్లో ఆప్ ఒకటని అన్నారు. ఆప్ పార్టీ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ మధ్యకాలంలో వింత సంఘటన చూశాం. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. స్పష్టమైన మెజారీటీతో ఆప్ విజయం సాధించింది. అయితే అక్కడ కూడా బీజేపీ తన కుట్రలు కుయుక్తులు ప్రదర్శించందన్నారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ప్రమాణం చేయాల్సి వచ్చిందన్నానరు.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తెచ్చి ఊపిరాడకుండా అనేక దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ గ‌వ‌ర్న‌మెంట్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తే ఐదు స‌భ్యుల‌తో కూడిన బెంచ్ స్ప‌ష్ట‌మైన ఆదేశం ఇచ్చింది. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం కింద‌నే అధికారులంద‌రూ ప‌ని చేయాల్సి ఉంటుంది. క‌చ్చితంగా ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు వినాలి. గ‌వ‌ర్న‌ర్ల చేతుల్లో ఉండ‌రాదు అని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్‌ను కూడా కాల‌రాశారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్క‌రిస్తూ ఇవాళ భ‌యంక‌రంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు.

Also Read: మోడీజీ 9 ఏళ్ళు, 9 సవాళ్ళు.. సమాధానం ఉందా?

నాటి ఎమ‌ర్జెన్సీ రోజులు గుర్తుకు తెస్తున్నారని మండిపడ్డారు. ఎమ‌ర్జెన్సీని వ్య‌తిరేకించే బీజేపీ నేత‌లు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇందిరా గాంధీ అమ‌లు చేసిన ఎమ‌ర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఢిల్లీ ప్ర‌జ‌లు మ‌రోసారి త‌గిన బుద్ధి చెబుతారు. కేంద్ర ప్ర‌భుత్వం ఒక ర‌కంగా ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను అవ‌మానిస్తోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

Also Read: గత చరిత్రలోకి పాత పార్లమెంట్‌

- Advertisement -