సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. భాషలకు అతీతంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బయోపిక్ లు వరుసగా విడుదలవుతున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నాయకుల బయోపిక్ లు కూడా తెరకెక్కిస్తున్నారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోది మీద సినిమా తయారవుతుండగా సౌత్‌లో ఎన్టీఆర్, వైయస్సార్, ఎంజీఆర్, జయలలిత మీద సినిమాలు రూపొందుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నేత బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు.
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. మై నేమ్ ఈజ్ రాగా అనే టైటిల్ తో ఈచిత్రం విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ ఎప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు రూపేశ్ పాల్ ఈచిత్రినికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రకథ ఇందిరా గాంధీ హత్య నుంచి మొదలై, ప్రస్తుత ఎన్నికల వరకూ సాగుతుందట.
రాహుల్ గాంధీ పాత్రలో అశ్వినికుమార్ నటిస్తున్నారు. ఇది జీవిత చరిత్ర కాదని, తనపై జరుగుతున్న ముప్పేట దాడి నుంచి అతడు ఎలా బయటపడగలిగాడనేదే ఈ చిత్రం కథా, కథనమని చిత్ర దర్శకుడు రూపేశ్ పాల్ తెలిపారు. ఈ సినిమాను నేను బయోపిక్‌గా భావించడం లేదు. ఓటమి, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తికి సంబంధించిన కథ ఇది. దీనిని నేను బయోపిక్ అనను. జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న వ్యక్తి విజయం సాధించిన తర్వాత అతడిని ఆపడం సాధ్యం కాదు.. ఇదే సినిమా కథ’ అని చెప్పారు దర్శకుడు.
https://youtu.be/Vc6LupHFtwo