‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ కు ముహుర్తం ఖరారు..

230
Lakshmis Ntr
- Advertisement -

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో సినిమాను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈసినిమా ప్రారంభమవుతుందని తెలిపారు దర్శకుడు వర్మ. ఇటివలే ఈమూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశాడు వర్మ. ఈరెండు పాటలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు చిత్రయూనిట్. ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తానని ప్రకటించారు.

lakshmis ntr

ఈసందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల మోస్ట్ డైనమిక్ లవ్ స్టోరీ ట్రైలర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తున్నాం. విశ్వాసం లేని కుటుంబాలు, విధేయత లేని అనుచరులు, వెన్నుపోటుదారుల సమాహారమే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. నిజాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైపోండి అని ట్వీట్ చేశారు. చూడాలి మరి ట్రైలర్ విడుదలయ్యాక ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తాడో వర్మ.

- Advertisement -