గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి

235
Varma movie
- Advertisement -

తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన అర్జున్ రెడ్డి సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వర్మ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈమూవీతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈమూవీకి దర్శకుడు బాల దర్శకత్వం వహించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం అవుట్ పుట్ సరిగ్గా రాకపోవడంతో మళ్లీ రీషూట్ చేయాలని భావిస్తున్నారు చిత్ర నిర్మాతలు. అంతేకాకుండా హీరో ధృవ్ తప్ప మిగతా టీం మొత్తం మార్చనున్నట్లు తెలిపారు.

varma movie

అయితే నిర్మాత‌లు త‌నపై చేస్తున్న అస‌త్య ప్ర‌చారంపై తాజాగా స్పందించారు బాలా. ప్రెస్ నోట్ విడుద‌ల చేసిన ఆయ‌న సినిమా ఆగిపోవ‌డానికి తాను రూపొందించిన విధానం కార‌ణం కాద‌ని, క్రియేటివ్ ఫ్రీడ‌మ్ వ‌ల‌నే సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. త‌న‌పై నిర్మాత‌లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా తెలిపాడు. ధృవ్ కెరీర్ దృష్ట్యా ఈ విష‌యంపై తాను ఎక్కువగా మాట్లాడ‌ద‌లచుకోలేదని అన్నాడు ద‌ర్శ‌కుడు బాలా. చిత్ర యూనిట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం జ‌న‌వ‌రి 22తోనే ముగిసింద‌ని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం దర్శకుడు గౌతమ్ మీనన్ ఈచిత్రినికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. ఈవిషయంపై త్వరలోనే అధికారిక ప్రటకన రానుందని సమాచారం.

- Advertisement -