ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియాభట్‌

153
- Advertisement -

బాలీవుడ్‌ స్టార్‌ ఫ్యామీలీ అయిన రణ్‌బీర్‌ కపూర్‌ ఆలియా భట్‌ గతేడాది ఏప్రిల్‌14న వీరిద్దరు ఘనంగా వివాహాం చేసుకున్నారు. ఆయితే తాజాగా రణ్‌బీర్‌ ఆలియాభట్‌ తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని రిలయన్స్‌ ఆసుపత్రిలో ఈ కపుల్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం ఆలియా భట్‌ రణ్‌బీర్‌ కలిసి ఆసుపత్రికి వచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని చెప్పారు.

ఈ శుభవార్తతో కపూర్‌ కుటుంబంతో సందడి వాతావరణం నెలకోంది. అలియాని చూసేందుకు కపూర్‌ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు నెటిజన్లు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు.

పెళ్లైన రెండు నెలలకే ఆలియాభట్‌ ప్రెగ్నెన్సీ అని ఈ కపుల్‌ వెల్లడించారు. బ్రహ్మస్త్ర షూటింగ్‌ సమయంలో ఆలియా భట్‌ ప్రెగ్నెన్సీతోనే నటించింది. ఆసుపత్రిలో స్కానింగ్‌ చేస్తున్న పిక్‌ను పోస్ట్‌ చేస్తూ అందరికీ షాక్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..

మళ్లీ సాయిపల్లవి కాంట్రావర్సీ కామెంట్స్‌!

తిరుమల అప్‌డేట్

వారసుడు…రంజితమే

- Advertisement -