రణ్‌బీర్‌తో పెళ్లా…!:ఆలియా

285
alia

బాలీవుడ్ స్టార్ నటులు ర‌ణ్‌బీర్ క‌పూర్-ఆలియా భ‌ట్ ల ప్రేమ వ్యవహారం కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పబ్లిక్‌ కలిసి తిరగడంతో వీరు లవ్‌లో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న గాసిప్స్‌కు చెక్ పెట్టేసింది ఆలియా. రణ్‌బీర్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.రణ్‌బీర్‌ కపూర్‌ను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లే అంటూ కొట్టిపారేసింది.

పెళ్లి గురించే ఆలోచించే వయసు కూడా నాకు ఇంకా రాలేదని తెలిపింది. ర‌ణ్‌బీర్‌తో బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌నిపించిన‌పుడు దాని గురించి ఆలోచిస్తా. అప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించను ఓన్లీ సినిమాలపైనే నా ఫోకస్ అంతా పెడతానని చెప్పింది. ప్రస్తుతం ఆలియా చేతిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్-రామ్ చరణ్‌ మల్టీస్టారర్‌గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో కీరోల్ పోషించనుంది ఆలియా.