దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలలో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13న మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అలియా భట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్.. ఈ రోజు అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ను విడుదల చేశాడు.
ఈ సినిమాలో సీతారామరాజు (చెర్రీ)కి జోడీగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. నా సీత ఇదిగో అంటూ చెర్రీ ఈ లుక్‌ను విడుదల చేశారు. చీర కట్టి, బొట్టు పెట్టి ఉన్న ఆమె లుక్ అలరిస్తోంది. రామరాజు కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లు ఆమె కూర్చొని ఉంది. కాగా, ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా గతంలో ఆమె ఫస్ట్‌లుక్‌ను ‘ప్రియమైన జెన్నిఫర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఎన్టీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.