అల్లు అర్జున్ ఇంట్లో అల..సక్సెస్ పార్టీ

786
Ala Vaikuntapuramlo success
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తెరకెక్కిన మూడవ సినిమా అల..వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా గ్రాండ్ గా విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అల్లు అర్జున నటన, పూజా హెగ్డె అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బన్ని కెరీర్ లో మొదటి రోజు అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక ఈసినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర బృందం అంతా కలిసి అల్లు అర్జున్ ఇంట్లో సంబరాలు చేసుకున్నారు. హీరోయిన్ పూజా హెగ్డె, దర్శకుడు త్రివిక్రమ్, సుశాంత్, మురళిశర్మ, జానీ మాస్టర్, నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ లతో పాటు దర్శకులు సుకుమార్, మారుతిలు కూడా బన్నిని కలిసి కంగ్రాట్స్ తెలిపారు. ఓవర్సీస్ లో కూడా అల..వైకుంఠపురంలో సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు విజయం సాధించడంతో ఇద్దరు ఫుల్ హ్యాపిగా ఉన్నారు. ఇక మరోవైపు పలువురు సెలబ్రెటీలు కూడా అల్లు అర్జున్ కు ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షాలు తెలుపుతున్నారు.

- Advertisement -