ఎంత మంచివాడవురాపై కాన్ఫిడెంట్‌గా కళ్యాణ్‌ రామ్

405
kalyanram
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా భారీగా తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటివరకు ఆడియో రంగంలో సెన్సేషన్ సృష్టించిన ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతోంది.

ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుగాంచిన సతీష్ వేగేశ్నఈ సినిమాకు దర్శకత్వం వహించగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. గుజ‌రాతీ చిత్రం ‘ఆక్సిజ‌న్’ సినిమా ప్రేరణతో ఈ సినిమా తెరకెక్కిందట.

తన లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా అంద‌రికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే పాత్రలో కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలెట్‌గా నిలవనుందట. ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు ఫన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీపై చిత్ర యూనిట్ భారీ ఆశలు పెట్టుకుంది.

శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -