‘రాములో రాములా’ పుల్ వీడియో సాంగ్

308
ramulo-ramulo
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించారు. హారికా అండ్ హాసిని బ్యానర్ ,గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును సాధించింది.

తమన్ అందించిన సంగీతం ఈసినిమాకు హైలెట్ గా నిలిచింది. పాటలతోనే ఈమూవీ సగం విజయం సాధించిందని చెప్పుకోవాలి. ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. హిట్టైన పాట‌ల‌కి సంబంధించిన వీడియోల‌ని ఒక్కొక్కటిగా విడుద‌ల చేస్తున్న చిత్ర బృందం రీసెంట్‌గా రాములో రాముల పాట ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేసింది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి పాడారు.

- Advertisement -